AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (HMWSSB)లో మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ ప్రాతిపదికన..

TGPSC హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
TGPSC Hyderabad Metro Water Board Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 12, 2026 | 7:07 AM

Share

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (HMWSSB)లో మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ ప్రాతిపదికన మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్‌ 23 నుంచి దరఖాస్తులు ప్రారంభమవగా మరో 4 రోజుల్లో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అక్టోబర్‌ 17, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 130 మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్‌ విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

టీజీపీఎస్సీ హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సివిల్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 104 (80%)
  • ఎలక్ట్రికల్‌/మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల సంఖ్య: 19 (15%)
  • సీఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ పోస్టుల సంఖ్య: 7 (5%)

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (CSE), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (IT), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ECE) విభాగాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ తేదీ సెప్టెంబర్‌ 18, 2026 నాటికి సంబంధిత పరీక్ష ఫలితాలు వెల్లడై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 17, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతన శ్రేణి వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరమైన వేతనంతో పాటు ఇతర వర్తించే ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

టీజీపీఎస్సీ హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎంపిక విధానం ఇలా..

అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్షను కంప్యూటర్‌ ఆధారిత విధానం (CBRT) లేదా ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించవచ్చు. మొత్తం 450 మార్కులకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-I జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ – 150 మార్కులు, పేపర్‌-II సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టు – 300 మార్కులు చొప్పున ఉంటుంది. అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌తో పాటు తమ ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన అంశాలపై కూడా సమగ్రంగా సిద్ధం కావాలి.

దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 చెల్లించాలి. దీనితోపాటు పరీక్ష ఫీజు రూ.120 కూడా చెల్లించాలి. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర అర్హతలు, ఫీజు మినహాయింపు నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. రాత పరీక్ష డిసెంబర్‌ 2026 (తాత్కాలికం)లో నిర్వహించే అవకాశం ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • TGPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • HMWSSB మేనేజర్‌ (ఇంజినీరింగ్‌) నోటిఫికేషన్‌ను తెరవాలి.
  • అర్హతలు, వయోపరిమితి, ఫీజు వివరాలను పూర్తిగా చదవాలి.
  • సూచించిన విధంగా ఆన్‌లైన్‌ దరఖాస్తును పూరించాలి.
  • అవసరమైన వివరాలు సమర్పించి, వర్తించే ఫీజు చెల్లించాలి.
  • దరఖాస్తును సమర్పించిన తర్వాత కాపీని డౌన్‌లోడ్‌ చేసుకుని భద్రపరచుకోవాలి.

టీజీపీఎస్సీ హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us