ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం జగన్ శాసనసభ సమావేశాల్లో భాగంగా.. రాజధాని అంశంపై జరిగిన చర్చలో ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశముందని ప్రకటించారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదని, వికేంద్రీకరణ జరగాలని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ స్వాగతించింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంతోషకరమేనన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయన్నారు. అయితే కర్నూలులో హైకోర్టు మాత్రమే కాకుండా అసెంబ్లీ, సచివాలయం కూడా ఉండాలన్నారు. అప్పుడే రాజధానిగా అర్థం ఉంటుందని.. అదేవిధంగా అమరావతి, వైజాగ్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని.. రాజధానుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందన్నారు. ఈ క్రమంలో జగన్‌పై చంద్రబాబు చేసిన తుగ్లక్ వ్యాఖ్యలు సరికావన్నారు.