భారత్‌లో అడుగుపెట్టనున్న ఎలక్ట్రానిక్‌ వాహనాల దిగ్గజం టెస్లా.. తొలుత విక్రయాలు, ఆ తర్వాత..

|

Dec 28, 2020 | 9:09 PM

భారత్‌లోకి మరో అంతర్జాతీయ ఆటో మొబైల్‌ కంపెనీ అడుగుపెట్టనుంది. 2021లో అమెరికా ఎలక్ట్రానిక్‌ వాహనాల దిగ్గజం 'టెస్లా' భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధికారికంగా ప్రకటించారు.

భారత్‌లో అడుగుపెట్టనున్న ఎలక్ట్రానిక్‌ వాహనాల దిగ్గజం టెస్లా.. తొలుత విక్రయాలు, ఆ తర్వాత..
Follow us on

Tesla entry into india: భారత్‌లోకి మరో అంతర్జాతీయ ఆటో మొబైల్‌ కంపెనీ అడుగుపెట్టనుంది. 2021లో అమెరికా ఎలక్ట్రానిక్‌ వాహనాల దిగ్గజం ‘టెస్లా’ భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధికారికంగా ప్రకటించారు. మొదట్లో విక్రయాలు ప్రారంభించి.. ఆ తర్వాత టెస్లా కార్లపై భారతీయుల స్పందనను బట్టి దేశంలోనే కార్ల ఉత్పత్తి, అసెంబ్లింగ్‌ వంటి పూర్తి స్థాయి కార్యకలాపాలు మొదలుపెడతారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నితిన్‌ గడ్కారీ మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో ఆటోమొబైల్‌ రంగంలో భారత్‌ వాహనాల తయారీలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే టెస్లా కార్ల సంస్థ సీఈఓ ఎలన్‌ మస్క్‌ 2021లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నామని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసే నాటికి కార్లను డెలివరీ చేసేందుకు టెస్లా సన్నాహాలు చేస్తోంది. భారత మార్కెట్లో తొలిసారిగా విడుదల చేయనున్న ఈ కారు ధరలు రూ.55-60 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.