Madduvalasa Fishes : మడ్డువలస చేపలు..క్యూ కడుతున్న జనాలు..ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు !
సరిగ్గా వండాలి కానీ..చేపల పులుసు రుచి వర్ణించడం వీలవుతుందా..దాన్ని అనుభవించాలి అంతే. చేపల్లో ఫేమస్ అంటే పులస గురించే ఎక్కువమంది మాట్లాడుతారు. నో డౌట్....
సరిగ్గా వండాలి కానీ..చేపల పులుసు రుచి వర్ణించడం వీలవుతుందా..దాన్ని అనుభవించాలి అంతే. చేపల్లో ఫేమస్ అంటే పులస గురించే ఎక్కువమంది మాట్లాడుతారు. నో డౌట్. పులస టేస్ట్‌ను డామినేట్ చేసే లెవల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ చేపకు లేదు. అయితే మడ్డువలస చేపలు కూడా మంచి రుచిని కలిగి ఉంటాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా మడ్డువలస రిజర్వాయర్ ప్రాంతంలో మాత్రమే దొరికే అరుదైన చేపలు తక్కువ ధర ఉండటంతో నాన్-వెజ్ ప్రియులు ఆ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. సండే వచ్చిందంటే ఆ ప్రాంతాల్లో సందడి మాములుగా ఉండటం లేదు. వీక్ డేస్‌లోనూ రద్దీ బాగానే ఉంటుంది. అక్కడ తిలాఫియా, రొయ్య, బొచ్చ, ఎర్రమైలు, రాగండి, బంగారుపాప వంటి అరుదైన రకాలు దొరుకుతాయి.
ఈ డ్యామ్‌లో దొరికే చేపలు బరువు కేజీ పైనే తూగుతున్నాయి. కేజీ రూ.100 నుంచి రూ. 120 వరకు అమ్ముతున్నారు. ధర అందుబాటులో ఉంది..చేపలు కూడా ప్రెష్‌గా మన ముందు పట్టినవే..దీంతో స్థానికులు క్యూ కడుతున్నారు. స్థానిక ప్రాంతాల్లోనే కాకుండా రాజాం, పాలకొండ, బలిజిపేట, బొబ్బిలి, పార్వతీపురం, వీరఘట్టం, పొందూరు, చీపురుపల్లి, చోట్ల ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశా, కలకత్తా రాష్ట్రాలకు ఈ చేపల రవాణా జరుగుంది. రిజర్వాయర్‌లో చేపల వేట జీవన ఆధారంగా చేసుకుని వందలాది కుటుంబాలు బ్రుతుకుతున్నాయి. ఈ చేపల వంటకాలకు హోటళ్లలో మంచి గిరాకీ ఉంది. విందు భోజనాలకు భారీగా ఆర్డర్లు వస్తుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు.