శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు..

దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ వాతావరణం నెలకొన్న వేళ.. శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని కరన్‌నగర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం సీఆర్పీఎఫ్‌ బలగాలను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్ దాడులకు దిగారు. ఈ ఘటనలో 144వ బెటాలియన్‌కు చెందిన ఆరుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరోవైపు గ్రెనేడ్ ఎటాక్‌ చేసిన వెంటనే జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. జవాన్ల ఎదురుదాడితో […]

శ్రీనగర్‌లో ఉగ్రదాడి.. ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు..

Updated on: Oct 26, 2019 | 11:14 PM

దేశ వ్యాప్తంగా దీపావళి పండుగ వాతావరణం నెలకొన్న వేళ.. శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని కరన్‌నగర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం సీఆర్పీఎఫ్‌ బలగాలను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్ దాడులకు దిగారు. ఈ ఘటనలో 144వ బెటాలియన్‌కు చెందిన ఆరుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరోవైపు గ్రెనేడ్ ఎటాక్‌ చేసిన వెంటనే జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. జవాన్ల ఎదురుదాడితో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. పండుగ వేళ గ్రెనేడ్ ఎటాక్‌తో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పారిపోయిన ఉగ్రవాదుల కోసం ప్రత్యేక బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి.

Follow Us