Actor Narsing Yadav Death : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

|

Dec 31, 2020 | 9:19 PM

ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన..సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Actor Narsing Yadav Death : టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
Follow us on

ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు నర్సింగ్ యాదవ్(52) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన..సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ముఖ్యంగా ఆయన విలన్, కామెడీ విలన్ వేశాలు వేశారు. అన్ని భాషల్లో కలిపి ఆయన 300 పైగా చిత్రాల్లో నటించారు. విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన ‘హేమాహేమీలు’ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నర్సింగ్ యాదవ్ స్వస్థలం హైదరాబాద్. ‘క్షణక్షణం’, ‘ముఠామేస్త్రి’, ‘శంకర్ దాదా ఎమ్.‌బి.బి.ఎస్’, ‘గాయం’, ‘కిల్లర్’, ‘మాస్’, ‘మాయలోడు’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘టెంపర్’, ‘రేసుగుర్రం’, ‘పిల్ల జమిందార్’, ‘అన్నవరం’, సైనికుడు వంటివి ఆయనకు మంచి పేరు తెచ్చాయి. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లోనూ న‌టించారు. నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, తనయుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు.

Also Read :

Hyderabad News : కూకట్‌పల్లిలో విషాదం.. కోతిని గద్దించేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

Crime News : దొంగతనం చేసి సినిమా స్టైల్లో కథ అల్లింది..స్క్రీన్ ప్లే అయితే చింపేసింది..పోలీసులు షాక్

Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…

Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..