కోవిడ్ రోగులతో క్రిక్కిరిసిన అంబులెన్సులు, బ్రిటన్ లో కోరలు చాచిన కరోనా వైరస్, ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత
బ్రిటన్ లో కోవిడ్ 19 మళ్ళీ కోరలు చాచింది. ముఖ్యంగా ఇంగ్లండ్ లో హాస్పిటల్స్ కరోనా రోగులతో నిండిపోతున్నాయి.
బ్రిటన్ లో కోవిడ్ 19 మళ్ళీ కోరలు చాచింది. ముఖ్యంగా ఇంగ్లండ్ లో హాస్పిటల్స్ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. బుధవారం ఒక్కొకటి సుమారు 20 మంది పేషంట్లతో కూడిన సుమారు 15 కి పైగా అంబులెన్సులు రాయల్ లండన్ ఆసుపత్రి వద్ద, క్వీన్ ఎలిజిబెత్ హాస్పిటల్ వద్ద బారులు తీరాయి. ఈ హాస్పిటల్స్ లోకి ఈ వాహనాలు సజావుగా ఎంటరయ్యే పరిస్థితే లేకపోయింది. ఎమర్జెన్సీ వాహనాలన్నీ గంటలకొద్దీ రోడ్లపై నిలిచిపోయాయి. కేవలం అత్యవసర వైద్య సహాయం ఉన్నవారు మాత్రమే తమను సంప్రదించాలని అంబులెన్స్ సర్వీసులు కోరుతున్నాయి. కానీ వారి అభ్యర్థన కి ఫలితం అంటూ లేకపోయింది. అనేకమందికి ఎమర్జెన్సీ వైద్య సాయం అవసరమే.. ఇక…డాక్టర్ల కొరతతో బాటు ఆక్సిజన్ కొరత కూడా తీవ్రంగా ఉండడంతో ఆసుపత్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఆక్సిజన్ కి బహుశా రేషన్ తరహా విధానం తప్పకపోవచ్చునని ఓ ప్రముఖ డాక్టర్ అన్నారు.
నిన్న ఒక్క రోజే యూకే లో 51,135 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా-414 మంది రోగులు మరణించారు. డిసీజ్ ది రియాల్టీ ఆఫ్ కోవిడ్ హాస్పిటల్స్ ఆర్ ఎట్ బ్రేకింగ్ పాయింట్ అని ఓ వైద్యుడు వ్యాఖ్యానించారు.