Telangana Corona Cases : తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 42,485 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 253 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,993కి చేరింది. కొత్తగా వైరస్ కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌లో తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,554కి చేరింది. వైరస్ బారి నుంచి కొత్తగా 317 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,81,400కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,039 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 2,793 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 70,61,049 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
Also Read :
భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం