రాష్ట్రంలో కొనసాగుతున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌.. కమలం గూటికి తెలంగాణ తొలి పైలట్‌ అజ్మీరా బాబీ..!

|

Dec 07, 2020 | 12:32 PM

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటిన బీజేపీ తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది.

రాష్ట్రంలో కొనసాగుతున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌.. కమలం గూటికి తెలంగాణ తొలి పైలట్‌ అజ్మీరా బాబీ..!
Follow us on

తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో దూకుడు పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటిన బీజేపీ తెలంగాణలో అధికారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. బీజేపీ ఇప్పుడు ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరతీసింది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నుంచి స్వామిగౌడ్‌ బీజేపీలో చేరగా.. కాంగ్రెస్‌ నుంచి కాషాయం తీర్థం పుచ్చుకుంటున్నారు విజయశాంతి. సోమవారం ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరతున్నారు. ఆదివారం ఆమె అమిత్‌షా, ఇతర పెద్దలను కలిసిన ఓ ఫొటోను ఆదివారం మీడియాకు అందింది.

అయితే.. ఆ ఫొటోలో పసుపు రంగు చీరలో ఉన్న ఓ మహిళపై అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తెలంగాణ తొలి పైలట్‌ అజ్మీరా బాబీ అని తెలుస్తోంది. ఆమె కూడా సోమవారం అధికారికంగా బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. మంచిర్యాలకు చెందిన బాబీ తల్లిదండ్రులు అజ్మీరా హరిరాం నాయక్‌, జయశ్రీ ఉపాధ్యాయులుగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ఎంబీఏ పూర్తిచేసిన బాబీ.. విమానయాన రంగంపై ఆసక్తితో తొలుత ఎయిర్‌ హోస్టె్‌సగా పనిచేశారు. ఆ తర్వాత పైలట్‌గా శిక్షణ పొందారు. ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.