రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం : కేటీఆర్

|

Oct 30, 2020 | 6:19 PM

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తుల సంస్థ టీఎస్ జెన్ కో ఉంటుందన్న ఆయన, తొలి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ రుసుము, రోడ్ టాక్స్ మినహాయిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని, పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. జాతీయ రహదారుల పక్కన ప్రతీ 50 కిలోమీటర్ చొప్పున ఛార్జింగ్ […]

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం : కేటీఆర్
Follow us on

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి భారీ ప్రోత్సాహం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తుల సంస్థ టీఎస్ జెన్ కో ఉంటుందన్న ఆయన, తొలి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ రుసుము, రోడ్ టాక్స్ మినహాయిస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని, పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. జాతీయ రహదారుల పక్కన ప్రతీ 50 కిలోమీటర్ చొప్పున ఛార్జింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. టౌన్‌షిప్‌లలో ఛార్జింగ్ కేంద్రాల స్థాపనకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.