BREAKING: తెలంగాణలో కొత్తగా మరో 38 పాజిటివ్ కేసులు

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 9:35 PM

తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 1,699కి చేరింది. ఇక 618 యాక్టివ్ కేసులు ఉండగా.. 1036 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇవాళ 23 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా.. 26 కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో, ఇద్దరు రంగారెడ్డి జిల్లాలో నమోదైతే.. మిగిలిన 10 […]

BREAKING: తెలంగాణలో కొత్తగా మరో 38 పాజిటివ్ కేసులు
Follow us on

తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 1,699కి చేరింది. ఇక 618 యాక్టివ్ కేసులు ఉండగా.. 1036 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు 45 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఇవాళ 23 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా.. 26 కొత్త కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో, ఇద్దరు రంగారెడ్డి జిల్లాలో నమోదైతే.. మిగిలిన 10 ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారివిగా తేలింది. ఇప్పటివరకు 99 మంది వలస కూలీలకు కరోనా సోకింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, గద్వాల వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.