విషాదం.. పెళ్లైన 18 ఏళ్లకు పుట్టిన పాప..పాము కాటుతో మృతి

|

Mar 11, 2020 | 2:10 PM

విధి మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి ఈ ఘటనను ఉదాహారణగా చెప్పొచ్చు. ఓ జంటకు పిల్లలు పుట్టుకపోవడంతో వారు నోయని నోములు లేవు, చేయని పూజలు లేవు. ఎవరు ఏ డాక్టరును రిఫర్ చేసినా అక్కడికి వెళ్లిపోయేవారు. అలా వారి పెళ్లైనా 18 సంవత్సరాలకు ఏ పూజ ఫలమో ఆడబిడ్డ జన్మించింది. దీంతో ఆ బిడ్డను ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కానీ ఇక్కడే అనుకోని విషాదం చోటుచేసుకుంది. పది సంవత్సరాలు […]

విషాదం.. పెళ్లైన 18 ఏళ్లకు పుట్టిన పాప..పాము కాటుతో మృతి
Follow us on

విధి మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి ఈ ఘటనను ఉదాహారణగా చెప్పొచ్చు. ఓ జంటకు పిల్లలు పుట్టుకపోవడంతో వారు నోయని నోములు లేవు, చేయని పూజలు లేవు. ఎవరు ఏ డాక్టరును రిఫర్ చేసినా అక్కడికి వెళ్లిపోయేవారు. అలా వారి పెళ్లైనా 18 సంవత్సరాలకు ఏ పూజ ఫలమో ఆడబిడ్డ జన్మించింది. దీంతో ఆ బిడ్డను ఆ దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కానీ ఇక్కడే అనుకోని విషాదం చోటుచేసుకుంది. పది సంవత్సరాలు కూడా నిండని ఆ పాపను ఓ విష సర్పం బలితీసుకుంది.

వివరాల్లోకి వెళ్తే…మంచిర్యాల జిల్లా భీమిని మండలం మాల్లాడి గ్రామంలో నివశించే వెంకన్నకు పెళ్లైన 18 ఏళ్లకు కూతురు దీపిక పుట్టింది. ఆ పాపకు ఇప్పుడు 9 సంవత్సరాలు కాగా అదే గ్రామంలో మూడో తరగతి చదువుతుంది. అయితే ఈ సోమవారం  పాప ఆడుకుంటూ ఉండగా పాము కాటు వేసింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే గ్రామంలోని ఆర్‌ఎమ్‌పి డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడినుంచి మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బాలిక మృతి చెందింది. లేకలేక పుట్టిన బిడ్డ చనిపోవడంతో ఆ దంపతుల రోదన, గ్రామస్థులను కన్నీరు పెట్టించింది.