
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నేటి నుంచి (డిసెంబర్ 14) మొదలుకానుంది. దాదాపు 3 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పున:ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పాత వెబ్ పోర్టల్ ద్వారానే, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.
స్లాట్ బుకింద్ విధానాన్నే కొనసాగిస్తుండగా…. ప్రభుత్వ అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారా? లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవలే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. పాత విధానంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సూచించింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న (డిసెంబర్ 13)న మంత్రి వర్గ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి లేకుండా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని అధికారులను ఆదేశించారు.