తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఅర్సీ నివేదిక విడుదల.. పదవీ విరమణ వయస్సు పెంపు.!

Telangana PRC Report: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పీఅర్సీ నివేదిక విడుదల అయింది. తొలి వేతన సవరణ నివేదికను పీఅర్సీ నివేదికను..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఅర్సీ నివేదిక విడుదల.. పదవీ విరమణ వయస్సు పెంపు.!

Updated on: Jan 27, 2021 | 10:56 AM

Telangana PRC Report: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. పీఅర్సీ నివేదిక విడుదల అయింది. తొలి వేతన సవరణ నివేదికను పీఅర్సీ నివేదికను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. దీని ప్రకారం ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు 7.5 శాతం ఫిట్‌మెంట్ పెంపును ప్రతిపాదించింది. అంతేకాకుండా కనీస వేతనం రూ. 19 వేలుగా.. గరిష్ట వేతనం రూ. 1.62 లక్షలుగా ఉండాలని పీఅర్సీ రిపోర్ట్ పేర్కొంది.

అటు హెచ్‌ఆర్‌ఏను 30 శాతం నుంచి 24 శాతానికి కుదించింది. అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచింది. కాగా, ఈ అంశంపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో టీఎన్జీవో, టీజీవో ఉద్యోగ సంఘాలు భేటి కానున్నాయి. ఉద్యోగుల సమస్యలతో పాటు పీఆర్సీ నివేదికపైనా ఇరు వర్గాలు చర్చించనున్నాయి.

Also Read: టిక్‌టాక్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. యాప్‌పై శాశ్వత బ్యాన్ విధించే అవకాశం.!