కొత్త మంత్రుల శాఖలు ఇవే!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. రెండోసారి విజయవంతంగా మరో ఆరుగురికి చోటుకల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేటీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా ప్రాధాన్యతను బేరీజు వేసుకున్న కేసీఆర్ వారికి అవకాశం కల్పించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో కొత్త గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. […]

కొత్త మంత్రుల శాఖలు ఇవే!

Edited By:

Updated on: Sep 09, 2019 | 11:06 AM

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. రెండోసారి విజయవంతంగా మరో ఆరుగురికి చోటుకల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేటీఆర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా ప్రాధాన్యతను బేరీజు వేసుకున్న కేసీఆర్ వారికి అవకాశం కల్పించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో కొత్త గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు.

కొత్త మంత్రులు – శాఖలు

హరీశ్‌రావు  : ఆర్థిక శాఖ

కేటీఆర్   :    పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖలు

సబితా ఇంద్రారెడ్డి:   విద్యాశాఖ

గంగుల కమాలాకర్:  పౌరసరఫరాలు, బీసీ సంక్షేమం

సత్యవతి రాథోడ్:  గిరిజన, మహిళా, శిశు సంక్షేమం

పువ్వాడ అజయ్ కుమార్:   రవాణా శాఖ

కీలకమైన రెవెన్యూ, సాగునీటి పారుదల, మైనింగ్ తదితర శాఖలను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నట్టు సమాచారం.