హైకోర్టు లాక్ డౌన్ పొడిగింపు..!

|

Jun 06, 2020 | 8:44 PM

తెలంగాణలో న్యాయ వ్యవస్థ లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ను జూన్‌ 28 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ .

హైకోర్టు లాక్ డౌన్ పొడిగింపు..!
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణలో న్యాయ వ్యవస్థ లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ను జూన్‌ 28 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర, తది విచారణ కేసులను మాత్రం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపాలని జిల్లా కోర్టులకు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కోంది. ఇరువైపుల న్యాయవాదులు ప్రత్యక్ష విచారణ కోరితే జ్యుడిషియల్‌లో అకాడమీలో ఏర్పాట్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. జిల్లా, మేజిస్ట్రేట్‌ కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్‌డౌన్‌ ఈ నెల 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర, కుటుంబ వివాదాలకు సంబంధించిన కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరపాలని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో నేరుగా పిటిషన్లను దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు వెల్లడించింది. కోర్టుల్లో క్రమం తప్పకుండా మాస్కులు, శానిటైజేషన్‌ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం కోర్టులను ఆదేశించింది.