ఇంటర్ ఫలితాల వివాదం రాష్ట్రం వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. దీనిపై విద్యార్థులకు న్యాయం చేయడానికి తెలంగాణ సర్కార్ కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు రీ- వాల్యుయేషన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. గ్లోబరీనా సంస్థను ఇప్పటికిప్పుడు తప్పించడం వీలు పడదు కాబట్టి.. త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఇంటర్ రీ-వెరిఫికేషన్ ఫలితాల ప్రాసిసెంగ్ కోసం గ్లోబరీనాతో పాటు మరో స్వతంత్ర సంస్థకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఇక స్వతంత్ర సంస్థ ఎంపిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌కి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.