‘ఫొని’ ఎఫెక్ట్‌: 74 రైళ్లు రద్దు!

విశాఖ: ఫొని పెను తుపానుగా మారబోతోంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న  నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. గురు, శుక్రవారాల్లో భారీ గాలులతో  తీవ్రమైన వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపధ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకొని 74 రైళ్లను రద్దు చేస్తున్నట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. మే 2న సాయంత్రం నుంచి భద్రక్‌ – విజయనగరం రైలుతో పాటు హౌరా నుంచి నడిచే ఈస్ట్‌కోస్ట్‌, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసింది. అలాగే, అదే రోజు రాత్రి […]

'ఫొని' ఎఫెక్ట్‌: 74 రైళ్లు రద్దు!
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 01, 2019 | 8:08 PM

విశాఖ: ఫొని పెను తుపానుగా మారబోతోంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న  నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. గురు, శుక్రవారాల్లో భారీ గాలులతో  తీవ్రమైన వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపధ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకొని 74 రైళ్లను రద్దు చేస్తున్నట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. మే 2న సాయంత్రం నుంచి భద్రక్‌ – విజయనగరం రైలుతో పాటు హౌరా నుంచి నడిచే ఈస్ట్‌కోస్ట్‌, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసింది. అలాగే, అదే రోజు రాత్రి హౌరా నుంచి పూరీ వెళ్లే రైలును రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

హౌరా నుంచి బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్‌ వైపు వెళ్లే రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్టు స్పష్టంచేసింది. తుపాన్ తీవ్రత దృష్ట్యా మే 3న పూరీ, భువనేశ్వర్‌ నుంచి నడిచే అన్ని రైళ్లనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మే 2న భువనేశ్వర్‌, పూరీ వైపు వెళ్లే పలు రైళ్ల రాకపోకలపై ఆంక్షలు విధించినట్టు తెలిపింది. ఉత్తరకోస్తా జిల్లాలో ఈ తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రైల్వేస్టేషన్లలో సహాయ కేంద్రాలను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.