తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్.. కేసు రేపటికి వాయిదా..

| Edited By:

Jun 04, 2020 | 4:40 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. తెలంగాణలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షల నిర్వహణకే సిద్ధంగా ఉన్నారా ? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్.. కేసు రేపటికి వాయిదా..
Follow us on

Telangana SSC Exams: కోవిద్-19 విజృంభిస్తోంది. తెలంగాణలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షల నిర్వహణకే సిద్ధంగా ఉన్నారా ? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని ప్రభుత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

కాగా.. దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ఓ నివేదికను అందించారు. పరీక్షల నిర్వహణ విషయమై తేదీలవారీగా వివరాలను, సంబంధిత ఏర్పాట్ల వివరాలను హైకోర్టుకు ప్రభుత్వం ఈ సందర్భంగా అందించింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని హైకోర్టును పిటిషనర్ అభ్యర్ధించారు. కాగా కేసును హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

Also Read: టెన్త్ విద్యార్థుల కోసం.. నేటి నుంచి తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు..