ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టులో చుక్కెదురు..

| Edited By: Srinu

Jul 11, 2019 | 1:14 PM

ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది. వారి అభ్యర్థిత్వాన్ని మండలి చైర్మన్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో తమ అభ్యర్థిత్వాలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు రాములు నాయక్, యదవరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై టీఆర్‌ఎస్ఎల్పీ ఫిర్యాదు మేరకు శాసనమండలి చైర్మన్ చర్యలు తీసుకున్నారు. వారిద్దరిపై అనర్హత వేటు […]

ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టులో చుక్కెదురు..
Follow us on

ఎమ్మెల్సీలు రాములు నాయక్, యాదవ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది. వారి అభ్యర్థిత్వాన్ని మండలి చైర్మన్ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో తమ అభ్యర్థిత్వాలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వారి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు రాములు నాయక్, యదవరెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై టీఆర్‌ఎస్ఎల్పీ ఫిర్యాదు మేరకు శాసనమండలి చైర్మన్ చర్యలు తీసుకున్నారు. వారిద్దరిపై అనర్హత వేటు వేశారు. తమపై అనర్హత చెల్లదని వారిద్దరూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తమపై మండలి చైర్మన్ చట్ట విరుద్దంగా అనర్హత వేటు వేశారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణను హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. అనర్హత వేటుకు సంబంధించి పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. రాములు నాయక్, యాదవరెడ్డి పిటిషన్లను కొట్టివేసింది. మండలి ఉత్తర్వులు చట్టవ్యతిరేకంగా లేవని తేల్చిచెప్పింది.