గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిథిలో కొత్తగా 57 థీమ్ పార్కులు.. ప్రణాళికలు సిద్ధం చేసిన జీహెచఎంసీ..

|

Jan 04, 2021 | 8:50 PM

హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించే థీమ్ పార్కులను సిద్ధం చేస్తోంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిథిలో కొత్తగా 57 థీమ్ పార్కులు.. ప్రణాళికలు సిద్ధం చేసిన జీహెచఎంసీ..
Follow us on

GHMC logistics and theme parks:హైద‌రాబాద్ అంటేనే మ‌నంద‌రికి ట‌క్కున గుర్తొచ్చేది చార్మినార్, హైటెక్ సిటీ. అంత‌లా ఈ క‌ట్టడాలు న‌గ‌రానికి గుర్తింపు తెచ్చాయి. అయితే ఇప్పుడు అదే కోవ‌లోకి మరిన్ని కూడా చేరబోతున్నాయి. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ ఈ థీమ్ పార్కులను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ను ఆకుపచ్చ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఓవైపు హరితహారం కొనసాగుతుండగా.. మరోవైపు కాలనీలు, బస్తీల్లో ప్రజలు సేద తీరేలా పార్కులు అభివృద్ధి చేస్తోంది. మహానగర శివారు ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధిపై దృష్టిసారించిన జీహెచ్‌ఎంసీ గతంలో మాదిరిగా కాకుండా విభిన్నంగా ఉండే థీమ్‌ పార్కుల ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఇక, తాజాగా నగరంలో మరో 57 థీమ్ పార్కుల నిర్మాణానికి బల్దియా ప్రణాళికలు రచిస్తోంది. 57 పార్కులను థీమ్ పార్కులుగా అభివృద్ది చేయాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ఈ పార్కులను మరింత ఆకర్షణీయంగా పునర్నించాలని భావిస్తోంది. నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించే విథంగా నిర్మించాలని నిర్ణయించింది. మొత్తం 57 పార్కులలో ఎల్బీనగర్ జోన్ లో 16, కూకట్‌పల్లి జోన్ లో 6, శేరిలింగంపల్లి జోన్‌లో 10, సికింద్రాబాద్ జోన్‌లో 8, ఖైరతాబాద్ జోన్‌లో 14, చార్మినార్ జోన్‌లో 3 థీమ్ పార్కులుగా రూపొందించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు.

థీమ్ పార్కులలో సైన్స్ థీమ్ పార్కు, పర్యావరణ పార్కు, బతుకమ్మ పార్కు, సెవెన్ వండర్ పార్కు, ఇల్యూషన్ థీమ్ పార్కు, నాలెడ్జ్ పార్కు, జపనీస్ థీమ్ పార్కు, మొఘల్ గార్డెన్, నిజాం షాహీ థీమ్ పార్కు, ఫౌంటెన్ థీమ్ పార్కు, రాక్ గార్డెన్, చిల్డ్రన్స్ పార్కు, ఉమెన్స్ పార్కు తదితర వినూత్న అంశాలతో ఈ పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం డిజైన్లను రూపొందించి పనులు ప్రారంభించేందుకు జిహెచ్ఎంసి అర్భన్ బయోడైవర్సిటీ విభాగం చర్యలు చేపట్టింది. త్వరలో ఇవీ కార్యరూపం దాల్చనున్నట్లు సమాచారం.