విదేశీ ప్రయాణీకులకు.. క్వారంటైన్ నిబంధనలు మార్పు చేసిన సర్కార్..

|

Aug 30, 2020 | 1:06 AM

కరోనా నిబంధనలు ప్రకారం విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా వారం రోజుల పాటు ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్‌లో ఉండాలి. అయితే ఇప్పుడు దాని నుంచి మినహాయింపు పొంది నేరుగా ఇంటికి వెళ్లిపోవచ్చు.

విదేశీ ప్రయాణీకులకు.. క్వారంటైన్ నిబంధనలు మార్పు చేసిన సర్కార్..
Follow us on

కరోనా నిబంధనలు ప్రకారం విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా వారం రోజుల పాటు ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్‌లో ఉండాలి. అయితే ఇప్పుడు దాని నుంచి మినహాయింపు పొంది నేరుగా ఇంటికి వెళ్లిపోవచ్చు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం వందేభారత్ మిషన్, ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్’ ద్వారా భారత్‌కు తిరిగి వస్తున్న ప్రయాణీకుల క్వారంటైన్ నిబంధనలను సడలించింది. కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ విడుదల చేసిన ఈ నూతన మార్గదర్శకాలు ప్రకారం.. విదేశాల నుంచి వచ్చేవారిలో లక్షణాలు లేనివారు సరాసరి ఇంటికి వెళ్లిపోవచ్చు. (International Passengers Relaxations)

కొత్త మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..

  1. బిజినెస్ పని మీద తెలంగాణ వచ్చి నాలుగు రోజుల్లో తిరిగి వెళ్లాలని అనుకునేవారు.. బయల్దేరే సమయానికి ముందుగా 96 గంటలలోపు నిర్వహించిన RT-PCR పరీక్ష నెగటివ్ రిపోర్ట్‌ను చూపిస్తే ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. కేవలం 14 హోం క్వారంటైన్ మాత్రమే ఉండాలి.
  2. గర్భిణులు, 10 సంవత్సరాలు లోపు పిల్లలు, వైద్యం కోసం వచ్చిన వాళ్లకు RT-PCR పరీక్ష నెగటివ్ రిపోర్ట్‌ లేకున్నా.. వారికి ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
  3. ఇక నెగటివ్ RT- PCR పరీక్ష రిపోర్టు లేకుండా ప్రయాణిస్తున్న అసింప్టమాటిక్ ప్రయాణీకులు తప్పనిసరిగా 7 రోజులు ఇన్‌స్టిట్యూషన్ క్వారంటైన్‌, 14 హోం క్వారంటైన్‌లో ఉండాలి.
  4. కాగా, శంషాబాద్ విమానాశ్రయంలోని ఫారిన్ డిపార్చర్స్ అన్నింటిని పూర్తిగా శానిటైజ్ చేయడమే కాకుండా థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం వంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. అటు అందరూ కూడా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.