Lifted Restrictions On Liquor Shops: మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. లాక్‌డౌన్ నేపధ్యంలో మద్యం దుకాణాలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని.. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలను తెరుచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు.
గతంలోని లాక్ డౌన్ నిబంధనలు ప్రకారం.. మే 6 నుంచి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మొదలైన సంగతి తెలిసిందే. అప్పుడు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఇవ్వగా.. ఆ తర్వాత జూన్ 1 నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరుచుకోవచ్చునని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక జూలై 2న ఆబ్కారీ శాఖ మరోసారి ఉత్తర్వులను జారీ చేసి రాష్ట్రంలో రాత్రి 9:30 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతిచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఆ ఆంక్షలను పూర్తిగా తొలగించింది.