
తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో సీఎం పాల్గొన్నారు. పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ఐదేళ్లలో అద్భుత ప్రగతిని తెలంగాణ సాధించింది
తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి దీవించారు
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం
యాభై ఏళ్ల సమస్యలకు ఈ ఐదేళ్లలో పరిష్కారం లభించింది
చిత్తశుద్ధితో కరెంట్ సమస్యను అధిగమించాం
వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు పురోగతి సాధించాయి
మిషన్ భగీరథ లక్ష్యాలను సాధిస్తోంది
పెన్షన్లను పెంచి అన్ని వర్గాలకు న్యాయం చేశాం
మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశాం
చేనేత కార్మికుల సమస్యలు చాలావరకు పరిష్కరించాం
తెలంగాణ విభిన్న మతాల సమ్మేళనం
రైతాంగాన్ని ఆదుకుంటున్నాం
భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని చేపట్టాం
ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయితే తెలంగాణ అంతా పచ్చదనమే కనబడుతుంది
రైతుబంధు పథకం అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది
పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడాలి
అవినీతికి పాల్పడితే సహించేది లేదు
కాలంచెల్లిన చట్టాలు ఇంకా అమలవుతున్నాయి
కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాం