మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో చేదు అనుభవం..

|

Jan 06, 2020 | 12:37 PM

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. నేడు(జనవరి 6) వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆయన తిరుమల విచ్చేశారు. అయితే టీటీడీ అధికారులు ఆయనకు ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదానికి తావిచ్చింది. దీనిపై మంత్రి హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాలని భావించారు. అయితే అక్కడే ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ దామోదర్ కలగజేసుకుని సర్ది చెప్పారు. దీంతో ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పక్క రాష్ట్రం మంత్రి అయినప్పటికి […]

మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో చేదు అనుభవం..
Follow us on

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. నేడు(జనవరి 6) వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆయన తిరుమల విచ్చేశారు. అయితే టీటీడీ అధికారులు ఆయనకు ప్రోటోకాల్ పాటించకపోవడం వివాదానికి తావిచ్చింది. దీనిపై మంత్రి హరీశ్ అసహనం వ్యక్తం చేశారు. దర్శనం చేసుకోకుండానే వెనుదిరగాలని భావించారు. అయితే అక్కడే ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ దామోదర్ కలగజేసుకుని సర్ది చెప్పారు. దీంతో ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పక్క రాష్ట్రం మంత్రి అయినప్పటికి ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అయితే నేడు భక్తుల రద్దీ దృష్ట్యా విఐపీలకు ఎక్కువ ఏర్పాట్లు చెయ్యలేకపోయామని, అందరూ అర్ధం చేసుకోవాలని టీటీడీ అధికారుల చెప్తున్నారు.

ఇక వైకుంఠ ఏకదశి పర్వదినాన్ని పురష్కరించుకోని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఏపీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి, అనిల్ ‌కుమార్, సురేష్, విశ్వరూప్, బాలినేని, పుష్ప శ్రీవాణి, రంగనాథరాజు, నారాయణ స్వామి.. తెలంగాణ మంత్రులు కేటీఆర్, , తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి.. తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.