తెలంగాణ అన్నదాతల్లో ఆనందం.. రైతుల ఖాతాల్లో పంట సాయం నగదు జమ చేసిన సర్కార్

|

Dec 31, 2020 | 5:46 AM

యాసంగి సీజన్‌కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది.

తెలంగాణ అన్నదాతల్లో ఆనందం.. రైతుల ఖాతాల్లో పంట సాయం నగదు జమ చేసిన సర్కార్
Follow us on

రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సహాయాన్ని విడుదల చేయడంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో రూ.5వేల చొప్పున నగదు జమ చేసింది. మూడురోజులుగా రైతుల ఖాతాల్లో నగదు జమ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 42.33 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. 59.11 లక్షల ఎకరాలకు పంట సాయం కింద రూ. 2,955.70 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. గురువారం 6.41 లక్షల మంది రైతులకు చెందిన 22.48 లక్షల ఎకరాలకు రూ.1,123.78 కోట్లు జమ చేయనుంది. గతంలో చేసిన కష్టం చేతికి రాక ఎందరో రైతులు అప్పులపాలు అయ్యి వేధింపులకు గురయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో పంట సాయం అందిస్తుంది. రైతుబంధు సాయం అందుతుండటంతో రైతుల సాగుకు ఇబ్బంది లేకుండా ఉంటుందని రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.