విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీ ఫిక్స్..!

| Edited By:

May 13, 2020 | 12:17 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉండిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు విద్యాధికారులు కసరత్తు జరుపుతున్నారు. కరోనా వైరస్

విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీ ఫిక్స్..!
Follow us on

Telangana EAMCET: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉండిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు విద్యాధికారులు కసరత్తు జరుపుతున్నారు. కరోనా వైరస్ కారణంగా పలు పరీక్షలు వాయిదాపడిన విషయం విదితమే. అయితే.. జులై నాటికి వైరస్ అదుపులో వస్తుందని అధికారులు భావిస్తున్నారు. జులై మొదటి వారంలోనే పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తులు జరుపుతున్నారు. ఇతర పరీక్షలకు ఇబ్బంది కలుగకుండా ఉండాలంటే జులై 06వ తేదీ నుంచి ఎంసెట్ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

వివరాల్లోకెళితే.. జులై 18 నుంచి 23 వరకు JEE Mains పరీక్షలు, ఇదే నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఏపీ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్ష జరుగనుంది. ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ ఎంసెట్, తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ పరీక్షలు రాస్తారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జులై 06 నుంచి పరీక్షలు ప్రారంభించి..జులై 15 లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇలా చేస్తే…18వ తేదీ నుంచి జరిగే…JEE Mains పరీక్షలకు సిద్ధం కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

కాగా.. జులైలో కరోనా అదుపులోకి రాకుంటే..మాత్రం…ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ ఎంసెట్ నిర్వహించాల్సి వస్తుందని అంచనా. జూలై 18 నుంచి 23 వరకు జరిగే JEE Mains పరీక్షల ఫలితాలు జూలై 31 నాటికి వెలువడే అవకాశం ఉంది. అప్పటివరకు రాష్ట్ర ప్రవేశాల కౌన్సెలింగ్‌ నిర్వహించ వద్దని భావిస్తున్నారు. మొత్తానికి ఆగస్టు మొదటి వారంలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ చేపడితే ఇబ్బంది ఉండదన్న భావనతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ ఏడాది(2020) ఎంసెట్‌ దరఖాస్తుల సంఖ్య 2 లక్షలు దాటింది. మంగళవారం నాటికి మొత్తం 2,00,896 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇంజనీరింగ్‌కు 1,30,075, అగ్రికల్చర్‌ విభాగానికి 70,821 దరఖాస్తులు వచ్చాయి. ఎంసెట్‌తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలకు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.