ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు: కన్వీనర్ గోవర్థన్
తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ అలిసెరి గోవర్థన్ తెలిపారు. ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష జరగనుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ అలిసెరి గోవర్థన్ తెలిపారు. ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష జరగనుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోసం లక్షా 40,300 పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. 78 వేల మంది అగ్రి అండ్ మెడికల్ స్ట్రీమ్‌లో పరీక్ష రాస్తున్నారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇందుకు అగుణంగా ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 102 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్ష జరగనున్నట్లు వెల్లడించిన ఆయన.. ఆన్‌లైన్ పద్ధతిలో ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు 8వ తేదీ వరకు అవకాశం కల్పించామన్నారు. తమ హాల్ టికెట్లను eamcet.tsche.ac.in వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
తొలిసారిగా ఈ పరీక్షల్లో ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు కన్వీనర్ తెలిపారు. కొత్తగా కోవిడ్ డిక్లరేషన్ తీసుకొచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నామన్నారు. అక్టోబర్ మూడో వారంలో కౌన్సిలింగ్ పూర్తి చేసి.. నవంబర్‌లో క్లాసులు మొదలు పెట్టనున్నట్లు గోవర్థన్ వెల్లడించారు. పరిస్థితులు అనుకూలిస్తే కళాశాలలు తెరిచి తరగతులు నిర్వహిస్తామని గోవర్థన్ స్పష్టం చేశారు.