డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక: కేటీఆర్‌

|

Oct 26, 2020 | 12:51 PM

డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు మంత్రి కేటీఆర్‌. గత 75 ఏళ్లలో తొలిసారి ‘ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా’నంటున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని జియాగూడలో 2 పడక గదుల డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీ ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. “ఈ కాలనీలో 840 రెండు పడక గదుల నివాసాలను ప్రభుత్వం నిర్మించింది. తొలి ప్రాధాన్యతగా 568 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.. […]

డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక: కేటీఆర్‌
Follow us on

డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు మంత్రి కేటీఆర్‌. గత 75 ఏళ్లలో తొలిసారి ‘ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా’నంటున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని జియాగూడలో 2 పడక గదుల డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీ ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. “ఈ కాలనీలో 840 రెండు పడక గదుల నివాసాలను ప్రభుత్వం నిర్మించింది. తొలి ప్రాధాన్యతగా 568 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు.. పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు జరుపుకొన్నాం” అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో లక్ష 2 పడకగదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నగరంలోని నిరుపేదలకు దశలవారీగా ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. ఒక్కో ఇంటికి రూ.9 లక్షలు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. “గతంలో అగ్గిపెట్టె, డబ్బాల్లాంటి ఇళ్లు ఇచ్చేవారు. గత ప్రభుత్వాల హయాంలో కట్టిందే డబ్బా ఇల్లు అయితే అందులోనూ అవినీతి జరిగేది. జియాగూడ డిగ్నిటీ కాలనీలో బస్తీ దవాఖానాకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలో రూ.18 వేల కోట్లతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నాం. పైరవీలకు తావులేకుండా ఇళ్ల కేటాయింపు జరుగుతుంది. ఇళ్ల కేటాయింపుల్లో నాయకులు జోక్యం చేసుకోవద్దు”. అని కేటీఆర్‌ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మూసీ సుందరీకరణను కూడా త్వరలోనే చేపడతామని కేటీఆర్ అన్నారు. అంతకుముందు కేటీఆర్ కు మహిళలు బోనాలతో స్వాగతం పలికారు.