తెలంగాణలో కరోనా విజృంభణ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15,394 కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఆరుగురు కరనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 410 మంది మంది కోలుకోగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,582కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 253కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9,559 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 2,648 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 1,673 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధికంగా 861 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు మొత్తం 11, 813 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్‌లో 10,నల్గొండలో 2, భద్రాద్రిలో 8, సిద్దిపేటలో 1, వరంగల్ అర్బన్‌లో 4, వరంగల్ రూరల్ లో 5, మహబూబాబాద్ లో 1, మహబూబ్‌నగర్‌లో 3, అసిఫాబాద్ 1, గద్వాలలో 1, కామారెడ్డిలో 2, యాదాద్రి 2 కేసులు నమోదయ్యాయి