కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 596 పాజిటివ్ కేసులు, ఆ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు

|

Dec 05, 2020 | 9:28 AM

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 596 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,72,719కి చేరింది.

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 596 పాజిటివ్ కేసులు, ఆ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు
Follow us on

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 596 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,72,719కి చేరింది. అలాగే… శుక్రవారం వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1470కి చేరింది.  తెలంగాణలో శుక్రవారం 921 మంది వ్యాాధి బారి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,62,751కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8498 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో 6465 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో డెత్ రేటు 0.53 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 96.34 శాతంగా ఉంది.

తెలంగాణ గవర్నమెంట్ శుక్రవారం 59,471 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 57,22,82కి చేరింది. 803 టెస్టుల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 102 కేసులు వెలుగుచూశాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 47, రంగారెడ్డి జిల్లాలో 46, కరీంనగర్ జిల్లాలో 36 కేసులు నమోదయ్యాయి. నారాయణ పేటలో మాత్రం నిన్న ఒక్క కేసు కూడా నమోదుకాలేదు.

Also Read :

Sujana Chowdary : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ

Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?