వరద సాయం రూ.50 వేలు,ఇళ్లు కట్టుకునే వారికి రూ.8 లక్షలు, జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ వరాలు
వరద సాయం రూ.50 వేలు..ఇళ్లు కట్టుకునే వారికి రూ.8 లక్షలు, 80 గజాల లోపు ఇళ్లకు పూర్తిగా ఆస్తి పన్ను మాఫీ.. ఇలా హైదరాబాదీలకు అనేక బంపరాఫర్లు ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
వరద సాయం రూ.50 వేలు..ఇళ్లు కట్టుకునే వారికి రూ.8 లక్షలు, 80 గజాల లోపు ఇళ్లకు పూర్తిగా ఆస్తి పన్ను మాఫీ.. ఇలా హైదరాబాదీలకు అనేక బంపరాఫర్లు ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్ చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తదితర నేతలు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. అనంతరం టీ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మ్యానిఫెస్టోలోని వివరాలు వెల్లడించారు. వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5 లక్షలిస్తామన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5లక్షలు ఇస్తామని వెల్లడించారు.
మహిళలు, వృద్ధులు,వికాలాంగులకు మెట్రో, ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఎయిర్ పోర్టు వరకు ఎంఎంటీఎస్ మెట్రో విస్తరిస్తామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పిస్తామన్నారు. బస్తీ దవాఖానాలను 450 కి పెంచుతామన్నారు. పాతబస్తీ, కేబుల్ ఆపరేటర్లకు పోల్ ఫీజు రద్దు చేస్తామన్నారు. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.8 లక్షలిస్తామన్నారు. ఇళ్లుండి అదనపు గది కట్టుకోవడానికి రూ.4లక్షలిస్తామన్నారు. 80 గజాల లోపు ఇళ్లకు పూర్తిగా ఆస్తి పన్ను మాఫీ చేస్తామని.. ఇలా నగర వాసులకు అనేక వరాలు ప్రకటించారు.