దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు!

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని ఆయన చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తోపాటు మరికొంత మంది కమలం గూటికి చేరుతారని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కవిత, వినోద్‌ ఓటమితోనే తెలంగాణ రాష్ట్ర సమితి పతనం ప్రారంభమైందన్న దత్తాత్రేయ.. తెలంగాణలో అన్ని శాఖల్లోనూ అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని అభిప్రాయపడ్డారు. […]

దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు!

Edited By:

Updated on: Jul 13, 2019 | 5:40 PM

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని ఆయన చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌తోపాటు మరికొంత మంది కమలం గూటికి చేరుతారని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కవిత, వినోద్‌ ఓటమితోనే తెలంగాణ రాష్ట్ర సమితి పతనం ప్రారంభమైందన్న దత్తాత్రేయ.. తెలంగాణలో అన్ని శాఖల్లోనూ అవినీతి తీవ్ర స్థాయిలో ఉందని అభిప్రాయపడ్డారు.

దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్న బీజేపీకి గత ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రావడంతో ఆకాశమే హద్దుగా రాజకీయాలను శాసిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వాన్ని చేజిక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ వేత్తలు విశ్లేషిస్తున్నారు. గోవాలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో కలిసిపోయారు. ఇక ఏపీ, తెలంగాణలో కూడా ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించే పనిలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.