ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మృతి పట్ల.. తెలంగాణ సీఎం కేసీఆర్.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజుల క్రితమే కోడెల అనారోగ్యానికి గురయ్యారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కోడెల తట్టుకోలేకపోయారని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబసభ్యులు, కోడెల సన్నిహితులు తెలిపారు.