సమ్మె ఎఫెక్ట్: ఓయూ పరీక్షలు వాయిదా..

| Edited By:

Oct 19, 2019 | 1:41 PM

తెలంగాణ బంద్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. బంద్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. అక్టోబర్ 17, 18, 19వ తేదీలలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా.. వాటి తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇక మిగిలిన పరీక్షలు అక్టోబర్ 21న జరగనున్నాయి. రీ షెడ్యూల్ తేదీలో త్వరలో అధికారిక వెబ్ సైట్‌ (osmania.ac.in)లో తెలుపనున్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పు […]

సమ్మె ఎఫెక్ట్: ఓయూ పరీక్షలు వాయిదా..
Follow us on

తెలంగాణ బంద్ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. బంద్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. అక్టోబర్ 17, 18, 19వ తేదీలలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా.. వాటి తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇక మిగిలిన పరీక్షలు అక్టోబర్ 21న జరగనున్నాయి. రీ షెడ్యూల్ తేదీలో త్వరలో అధికారిక వెబ్ సైట్‌ (osmania.ac.in)లో తెలుపనున్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పు లేదు.

మరోవైపు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె అక్టోబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. దీని ఫలితంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలావుండగా, బస్సులను నడపడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ సీనియర్ అధికారి తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా చూసేందుకు ఆర్టీసీ నుంచి 3 వేల బస్సులు, విద్యా సంస్థల వాహనాలతో పాటు సుమారు 2,500 ప్రైవేటు బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రోజూ నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు.