కోవిడ్-19 : మీడియం రిస్క్ రాష్ట్రంగా తెలంగాణ !

|

Sep 18, 2020 | 7:43 PM

తాజాగా రిలీజ్ చేసిన ఓ కొత్త అధ్యయనం సామాజిక-ఆర్థిక సూచికల ఆధారంగా కోవిడ్ -19 కు సంబంధించి తెలంగాణ "మీడియం రిస్క్" ఉన్న రాష్ట్రం అని తెలిపింది.

కోవిడ్-19 : మీడియం రిస్క్ రాష్ట్రంగా తెలంగాణ !
Follow us on

తాజాగా రిలీజ్ చేసిన ఓ కొత్త అధ్యయనం సామాజిక-ఆర్థిక సూచికల ఆధారంగా కోవిడ్ -19 కు సంబంధించి తెలంగాణ “మీడియం రిస్క్” ఉన్న రాష్ట్రం అని తెలిపింది.  కోవిడ్ రిస్క్ పరిస్థితులను గురించి ప్రస్తావిస్తూ.. వ్యాధిని ఎదుర్కొనడంలో రాష్ట్రంలో సామాజిక-ఆర్థిక వనరలు క్షీణించలేదని వెల్లడించింది.  అక్షరాస్యత, మురికివాడలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, వృద్ధులపై వ్యాధి ప్రభావం, వ్యాధి సంక్రమణ రేటు,  మహమ్మారిని ఎదుర్కోవటానికి రాష్ట్ర సామర్థ్యం వంటి సామాజిక-ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్  ఈ అధ్యయనం చేసింది. వివిధ కోణాాల్లో సర్వే నిర్వహించి…జనాభా ససెప్టబిలిటీ ఇండెక్స్, సామాజిక-ఆర్థిక ఇండెక్స్, ప్రజారోగ్య స్థితిస్థాపకత ఇండెక్స్, మిశ్రమ బలహీనత ఇండెక్స్ లను అంచనా వేసి తెలంగాణను మీడియం రిస్క్ గ్రూపులో ఉంచారు. అయితే ఈ అధ్యయనం.. విద్య , కోవిడ్ -19 సంక్రమణ మధ్య ఆసక్తికరంగా సంబంధాన్ని కనుగొంది. కోవిడ్ -19 కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాలు అధిక అక్షరాస్యత రేటును కలిగి ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం.

Also Read :

ఏపీలో హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్ డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు

ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు