
హైదరాబాద్ నగరంలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌పై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పార్టీ ఆఫీసులో నిలిపి ఉంచిన కారుపై దుండగులు రాళ్లు విసిరారు. విషయం తెలిసిన వెంటనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు మఖ్దూంభవన్‌పై దాడి ఘటనను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు.
Also Read :
దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు