రెండు తెలుగురాష్ట్రాలకు ‘స్కోచ్’ అవార్డుల పంట

|

Jul 30, 2020 | 11:26 PM

ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ సంస్థ ప్రతీ ఏటా ప్రదానం చేసే అవార్డులకు ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎంపికయ్యాయి. వివిధ విభాగాల్లో పనితీరును కొలమానంగా తీసుకుని ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబర్చినందుకు ఈ అవార్డులను ఎంపిక చేస్తుంటారు.

రెండు తెలుగురాష్ట్రాలకు స్కోచ్ అవార్డుల పంట
Follow us on

ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ సంస్థ ప్రతీ ఏటా ప్రదానం చేసే అవార్డులకు ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎంపికయ్యాయి. వివిధ విభాగాల్లో పనితీరును కొలమానంగా తీసుకుని ఉత్తమ ప్రతిభ, పనితీరు కనబర్చినందుకు ఈ అవార్డులను ఎంపిక చేస్తుంటారు.  ప్రస్తుత సంవత్సరానికి తెలంగాణలో ఇసుక విక్రయం, నిర్వహణలో మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి ఈ అవార్డు లభించింది. అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌, టీ-చిప్స్‌ విభాగానికి అవార్డులు దక్కాయని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి  వెల్లడించారు. అటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు ఐదు స్కోచ్‌ అవార్డులు దక్కాయి. ఉపాధి హామీ అమలు, నిర్వహణ, కెపాసిటీ బిల్డింగ్‌ విభాగాల్లో అవార్డులు దక్కినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్కోచ్‌ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఐటీ విభాగాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు.