టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సూచన మేరకే వీరంతా పార్టీ మారుతున్నారని ఆరోపించారు.
ఇప్పటి వరకు జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకే చంద్రబాబుకుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. వీటన్నిటినీ కప్పిపుచ్చుకోడానికే తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేరేలా ప్లాన్ చేసారని రామచంద్రయ్య ఆరోపించారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వారిని పార్టీలో చేర్చుకునే ముందు ప్రధాని మోదీ ఒక్కసారి ఆలోచించాలని విఙ్ఞప్తి చేశారు. చంద్రబాబు లాంటి వారిని ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు.