Balakrishna Comments : నోరు అదుపులో పెట్టుకో.. మా సహనాన్ని పరీక్షించోద్దు.. కొడాలికి బాలయ్య వార్నింగ్

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jan 06, 2021 | 6:18 PM

లెజెండ్ బాలయ్య సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ఆలయాలపై దుండగులు దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని.. చాలా కిరాతకమైన చర్య అని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం..

Balakrishna Comments : నోరు అదుపులో పెట్టుకో.. మా సహనాన్ని పరీక్షించోద్దు.. కొడాలికి బాలయ్య వార్నింగ్

TDP MLA Balakrishna Comments : లెజెండ్ బాలయ్య సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ఆలయాలపై దుండగులు దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని.. చాలా కిరాతకమైన చర్య అని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హిందూపురంలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ‌లో రాక్షస పాలన సాగుతోందంటూ డైలాగ్‌ల బాంబులు పేల్చారు. మంత్రి కొడాలి నానికి పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తస్మాత్‌ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. పేకాట విషయంలో ఒకడి తమ్ముడు పట్టుబడితే… ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, చట్టమంటే అంత చులకనా అంటూ కామెంట్స్‌ చేశారు బాలకృష్ణ.

రాష్ట్రంలో యువత, రైతులు, కార్మికులు.. అందరూ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. వినాశకాలే విపరీత బుద్ధి అని, ఇప్పటినుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబని అని మంత్రి కొడాలి నాని విమర్శించిన సంగతి తెలిసిందే. నీచ రాజకీయం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్‌ చేశారు. అందుకే మత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు సీఎం జగన్‌ గురించి మాట్లాడితే మిడత లాంటి లోకేష్‌కు మూతి పళ్లు రాలతాయని వార్నింగ్‌ ఇచ్చారు కొడాలి నాని.

ఇవి కూడా చదవండి :

Buy Gold Jewellery : బంగారం కొనేందుకు వెళ్తున్నారా..? అయితే ఈ డాక్యుమెంట్స్ మరిచిపోవద్దు…

Janga Raghava reddy : వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న జంగా రాఘవ రెడ్డికి కరోనా పాజిటివ్..

Chinese Apps Bans : డ్రాగన్ కంట్రీకి మరో దెబ్బ.. ఎనిమిది చైనా కంపెనీల లావాదేవిలపై అమెరికా నిషేదం..

Share Market News Today : ఈ ఏడాదిలో తొలిసారి నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్లు.. డే హై నుంచి పతనం వైపు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu