AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇళ్ళను ఆక్రమించుకుంటాం… టీడీపీ నేతల హెచ్చరిక

పేదల కోసం విజయవాడ నగరంలో నిర్మించిన ఇళ్ళను ఆక్రమించుకుంటామంటున్నారు ఏపీ తెలుగుదేశం నేతలు. బుధవారం టిడ్కో చీఫ్ ఇంజనీర్ కృష్ణారెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ లీడర్లు హెచ్చరిక జారీ చేశారు.

ఇళ్ళను ఆక్రమించుకుంటాం... టీడీపీ నేతల హెచ్చరిక
Rajesh Sharma
|

Updated on: Oct 28, 2020 | 1:49 PM

Share

TDP leaders warns AP Government: ఏపీలో ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంగా పేదలకు ఇళ్ళు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ప్రభుత్వం పేదల నుంచి ఇళ్ళ పేరిట వసూలు చేసిన మొత్తాలను వడ్డీతో సహా వారికి తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణం పూర్తయి, గతంలోనే కేటాయించిన ఇళ్ళను వెంటనే పేదలకు అప్పగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఏపీ టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్, బొండా ఉమమహేశ్వర రావు, బుద్దా వెంకన్న తదితరులు బుధవారం టిడ్కో చీఫ్ ఇంజినీర్ కృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అయిదేళ్ళలో మొత్తం 8 లక్షల ఇళ్ళను పేదలకు కేటాయించిందని.. ప్రస్తుతం జగన్ సర్కార్ గత ఏడాదిన్నరగా పేదలకు ఇళ్ళు ఇవ్వలేదని వారు ఆరోపించారు. విజయవాడ నగరంలో చాలా ఇళ్ళ నిర్మాణం తుదిదశలో వుందని, వాటిని వెంటనే కేటాయిస్తే పేదలకు అద్దె కలిసి వస్తుందని వారంటున్నారు. అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ వారంతా ప్రభుత్వానికి చెల్లించారని, ఇపుడు వడ్డీలు కట్టలేకపోతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 12 వేల మంది ఒక్కొక్కరు 25 వేల రూపాయల చొప్పున చెల్లిస్తే.. అధికారులు ప్రస్తుతం కేవలం 6,500 మందికే ఇళ్ళు కేటాయిస్తామని చెబుతున్నారని వారు ఆరోపించారు.

గతంలో పేదలకు కేటాయించి, నిర్మాణం పూర్తి అయిన ఇళ్ళను వారికి వెంటనే అప్పగించాలని, లేని పక్షంలో పేదలతో కలిసి తామే ఆ ఇళ్ళను ఆక్రమించుకుంటామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తాలను వడ్డీతో సహా చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also read: కొత్త సచివాలయ నిర్మాణానికి ‘సుప్రీం‘ ఓకే