నక్కా ఆనందబాబు పిలుపు

|

Sep 28, 2020 | 3:43 PM

టీడీపీ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. వైసీపీకి అధికారం కట్టబెట్టింది దళుతులే కావునా, వారిపై దాడిచేసే హక్కు తమకుందన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం చేయడం దారుణమని ఆయన అమరావతిలో వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ప్రమాదం పొంచి ఉన్నందున దళితసంఘాలు స్పందించాల్సిన సమయం వచ్చిందని కోరారు. దళితులపై ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై రామకృష్ణ విజయవాడలో మాట్లాడటం నేరమా? అని ఆనందబాబు ప్రశ్నించారు. జరుగుతున్న […]

నక్కా ఆనందబాబు పిలుపు
Follow us on

టీడీపీ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. వైసీపీకి అధికారం కట్టబెట్టింది దళుతులే కావునా, వారిపై దాడిచేసే హక్కు తమకుందన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం చేయడం దారుణమని ఆయన అమరావతిలో వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి ప్రమాదం పొంచి ఉన్నందున దళితసంఘాలు స్పందించాల్సిన సమయం వచ్చిందని కోరారు. దళితులపై ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై రామకృష్ణ విజయవాడలో మాట్లాడటం నేరమా? అని ఆనందబాబు ప్రశ్నించారు. జరుగుతున్న ఘటనలు చూస్తుంటే, పథకం ప్రకారమే ప్రభుత్వం దళితులపై దాడులు చేస్తున్నట్లుగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.