భయపడొద్దు.. పట్టాభికి బాబు, లోకేష్, ఉమ ధైర్యం

|

Oct 04, 2020 | 1:13 PM

టీడీపీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ అధినాయకత్వం మండిపడింది. ఈ ఘటనపై అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్.. పట్టాభికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. నిన్న సబ్బం హరి ఇంటిని పగులకొట్టారని, అనంతరం పట్టాభి కారును కూడా ధ్వంసం చేశారని నారా లోకేశ్ […]

భయపడొద్దు.. పట్టాభికి బాబు, లోకేష్, ఉమ ధైర్యం
Follow us on

టీడీపీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ అధినాయకత్వం మండిపడింది. ఈ ఘటనపై అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్.. పట్టాభికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. నిన్న సబ్బం హరి ఇంటిని పగులకొట్టారని, అనంతరం పట్టాభి కారును కూడా ధ్వంసం చేశారని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ కొనసాగుతోందని మండిపడ్డారు.

ఇక, మరో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను ప్రశ్నిస్తున్న పట్టాభిరామ్ కు సమాధానం చెప్పలేక కారు ధ్వంసం చేయడం దుర్మార్గం, ఇది ప్రభుత్వ పిరికిపంద చర్య. నిన్న సబ్బంహరి, నేడు పట్టాభి. మీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ధైర్యం ఉంటే పట్టాభి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి’ అని ఉమ డిమాండ్ చేశారు.