‘చప్పట్లు కొట్టాలా?.. చెట్టుకి కట్టేసి కొట్టాలా?’ బండారు ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చిన చప్పట్ల పిలుపుకు కౌంటరిచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. గ్రామ వాలంటీర్ల సేవలను గౌరవిస్తూ ఈ సాయంత్రం అందరం ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడదామని జగన్ ఇచ్చిన పిలుపుపై ఆయన తీవ్రంగా స్పందించారు. రెండు వరుస ట్వీట్లలో సీఎం జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు. ‘మహిళ పై హత్యాయత్నం చేసిన వాలంటీర్ కి కృతజ్ఞతలు తెలపాలా? ఇలాంటి దుర్మార్గాలకు […]

చప్పట్లు కొట్టాలా?.. చెట్టుకి కట్టేసి కొట్టాలా? బండారు ప్రశ్న

Updated on: Oct 02, 2020 | 5:42 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చిన చప్పట్ల పిలుపుకు కౌంటరిచ్చారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. గ్రామ వాలంటీర్ల సేవలను గౌరవిస్తూ ఈ సాయంత్రం అందరం ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడదామని జగన్ ఇచ్చిన పిలుపుపై ఆయన తీవ్రంగా స్పందించారు. రెండు వరుస ట్వీట్లలో సీఎం జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు.

‘మహిళ పై హత్యాయత్నం చేసిన వాలంటీర్ కి కృతజ్ఞతలు తెలపాలా? ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న వారికి చప్పట్లు కొట్టాలా? చెట్టుకి కట్టేసి కొట్టాలా? సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారూ.’ అంటూ ప్రశ్నించారు బండారు. ఇక మరో ట్వీట్ లో గ్రామ వాలంటీర్లపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తో కూడిన వీడియో పోస్ట్ చేసి ఈ విధంగా పేర్కొన్నారు.

‘బాలిక పై అత్యాచారం చేసిన వాలంటీర్ కి చప్పట్లు కొట్టాలా?
వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన వాలంటీర్ కి సత్కారం చెయ్యాలా?
నాటు సారా కాసిన వాలంటీర్ ని అభినందించాలా?
అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్ కి సన్మానం చెయ్యాలా?’
అంటూ అందుకున్నారు బండారు సత్యనారాయణ మూర్తి.