చంద్రబాబు షాకింగ్ కామెంట్స్: గ్రామ వాలంటీర్లు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ వాలంటీర్ వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఐదు వేల రూపాయల జీతంతో గోనె సంచులు మోసే ఉద్యోగాన్ని ఇచ్చారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, ఇటీవల ఓ యువతిపై గ్రామ వాలంటీర్ లైంగిక వేధింపులకు దిగడని, అది సాధ్యం కాకపోవడంతో మరో అమ్మాయితో రాయభారం నడిపాడని..దీంతో ఆ యువతి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. […]

చంద్రబాబు షాకింగ్ కామెంట్స్:  గ్రామ వాలంటీర్లు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 28, 2019 | 2:58 AM

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ వాలంటీర్ వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఐదు వేల రూపాయల జీతంతో గోనె సంచులు మోసే ఉద్యోగాన్ని ఇచ్చారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, ఇటీవల ఓ యువతిపై గ్రామ వాలంటీర్ లైంగిక వేధింపులకు దిగడని, అది సాధ్యం కాకపోవడంతో మరో అమ్మాయితో రాయభారం నడిపాడని..దీంతో ఆ యువతి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని, వైసీపీ పాలనలో ఇంకెన్ని అకృత్యాలను చూడాలో అర్ధం కావడం లేదంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

గ్రామవాలంటీర్ల ఉద్యోగాలను ఎవరు ఇమ్మన్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ఉద్యోగాలతో లాభం ఏమిటన్నారు. ఇంట్లో భర్తలు లేని సమయంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్తున్నారని, ఎప్పుడంటే అప్పుడు తలుపులు కొడుతూ నీచానికి పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి చూస్తుంటే ఎంతో ఆవేదన కలుగుతుందన్నాను. గ్రామ వాలంటీర్లతో ప్రమాదం వచ్చి పడిందంటూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు

మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..
విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కోపంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచి..