ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

ఏపీ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్‌తో ప్రతిపక్షనేత చంద్రబాబు భేటీ అయ్యారు . ఆయనతో సుమారు 15 నిమిషాల సేపు పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గవర్నర్ గుర్తుచేసుకున్నారు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో తొలిసారిగా ఎన్టీఆర్‌ను కలిశానని చెప్పారు. అదే విధంగా ఒరిస్సా మాజీ సీఎం బిజూ పట్నాయక్‌తో తనుకున్న స్నేహాన్ని గవర్నర్‌తో పంచుకున్నారు చంద్రబాబు. రాజకీయ, సామాజిక పరిస్థితులు, రాష్ట్ర సమస్యలపై కూడా గవర్నర్ బిశ్వభూషణ్‌తో చంద్రబాబు చర్చించారు.

ఏపీ గవర్నర్‌తో చంద్రబాబు  భేటీ

Edited By:

Updated on: Jul 25, 2019 | 9:03 PM