దాడుల్ని ఖండించిన చంద్రబాబు

వైపీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.  మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఏపీలో ఎక్కడికక్కడే టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేవలం తమ పార్టీ శ్రేణులపైనే కాకుండా మీడియా ప్రతినిధులను కూడా బెదిరిస్తున్నారని.. నెల్లూరులో ఓ రిపోర్టర్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా చంపుతానని బెదిరించారని, విశాఖలో కూడా జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడ్డారని […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:56 pm, Tue, 9 July 19
దాడుల్ని ఖండించిన చంద్రబాబు

వైపీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.  మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఏపీలో ఎక్కడికక్కడే టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేవలం తమ పార్టీ శ్రేణులపైనే కాకుండా మీడియా ప్రతినిధులను కూడా బెదిరిస్తున్నారని.. నెల్లూరులో ఓ రిపోర్టర్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా చంపుతానని బెదిరించారని, విశాఖలో కూడా జర్నలిస్ట్‌పై దాడికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. దాడులకు తెగబడుతున్న వైసీపీ నేతల ఆగడాలను ఇకపై సహించబోనన్నారు. విపరీతంగా పెరిగిపోయిన వైసీపీ నేతల ఆగడాలను అంతా ఖండించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.