ముందు చూపులేని ఏపీ బడ్జెట్ : చంద్రబాబు విమర్శలు

| Edited By: Srinu

Jul 13, 2019 | 4:52 PM

ఏపీ బడ్జెట్‌పై టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుచూపు లేని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. శ్వేతపత్రంలో ఒకవిధంగాను , బడ్జెట్‌లో మరొక విధంగాను పేర్కొన్నారని ఆరోపించారు చంద్రబాబు. 2014లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 6 వేలు మాత్రమే ఎక్కువని, అది ఇవాళ రూ.38 వేలు ఎక్కువ కావడం గత టీడీపీ ప్రభుత్వ ఘనతే అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించాల్సి వాటికి కోతలు పెట్టారని ఆయన మండిపడ్డారు. […]

ముందు చూపులేని ఏపీ బడ్జెట్ :  చంద్రబాబు విమర్శలు
Follow us on

ఏపీ బడ్జెట్‌పై టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందుచూపు లేని బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. శ్వేతపత్రంలో ఒకవిధంగాను , బడ్జెట్‌లో మరొక విధంగాను పేర్కొన్నారని ఆరోపించారు చంద్రబాబు. 2014లో తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 6 వేలు మాత్రమే ఎక్కువని, అది ఇవాళ రూ.38 వేలు ఎక్కువ కావడం గత టీడీపీ ప్రభుత్వ ఘనతే అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించాల్సి వాటికి కోతలు పెట్టారని ఆయన మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో నీళ్లు పారించేందుకే దృష్టిపెట్టారని చంద్రబాబు విమర్శలు చేశారు. సున్నా వడ్డీ రుణాలకు కేవలం రూ.100 కోట్లే కేటాయించారని, వాస్తవానికి దీనికి రూ.4 వేల కోట్లు అవరసమన్నారు. వీటన్నిటితోపాటు 139 కార్పొరేషన్లు అని చెప్పి.. వాటికి కేటాయించింది ఎంతో స్పష్టంగా చెప్పలేదని చంద్రబాబు ఆరోపించారు.