తెనాలిలో ఉద్రిక్తత.. అమరావతి రిలే దీక్షా శిబిరంపై దాడి!

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి రిలే దీక్ష శిబిరంపై వైసీపీ దాడికి పాల్పడటంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీక్ష శిబిరం ఎదుట వైసీపీ నేతలు బైక్‌లతో చక్కర్లు కొడుతున్నారు. శిబిరం ఎదుటే చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి అలజడి సృష్టించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అమరావతి రైతుల శిబిరంపై అధికార అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అమరావతి రిలే […]

తెనాలిలో ఉద్రిక్తత.. అమరావతి రిలే దీక్షా శిబిరంపై దాడి!

Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 25, 2020 | 5:13 PM

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి రిలే దీక్ష శిబిరంపై వైసీపీ దాడికి పాల్పడటంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పలువురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. దీక్ష శిబిరం ఎదుట వైసీపీ నేతలు బైక్‌లతో చక్కర్లు కొడుతున్నారు. శిబిరం ఎదుటే చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి అలజడి సృష్టించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అమరావతి రైతుల శిబిరంపై అధికార అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అమరావతి రిలే దీక్ష శిబిరం ఎదుట వైసీపీ నేతలు అధికార వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేసి రెచ్చగొట్టే యత్నం చేశారు. జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో… పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకూ నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు. వైకాపా కార్యకర్తలు ఐకాస శిబిరానికి నిప్పుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన తెదేపా కార్యకర్తలు ఆర్పివేశారు. ఈ ఘటనలో అమరావతి నినాదాలతో ఉన్న ఫ్లెక్సీలు కాలిపోయాయి.