రేపటి శాసనసభ భేటీపై.. టీడీఎల్పీ కీలక నిర్ణయం!

ఏపీ చరిత్రలోనే రేపటి అసెంబ్లీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు జరిగే శాసనసభ భేటీకి హాజరయ్యే అంశంలో తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో చర్చ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీడీఎల్పీ భేటీలో నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరంగా ఉండాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు శాసనసభలో జగన్ సర్కార్ మండలి రద్దుపై […]

రేపటి శాసనసభ భేటీపై.. టీడీఎల్పీ కీలక నిర్ణయం!

Edited By:

Updated on: Jan 26, 2020 | 4:45 PM

ఏపీ చరిత్రలోనే రేపటి అసెంబ్లీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు జరిగే శాసనసభ భేటీకి హాజరయ్యే అంశంలో తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో చర్చ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని టీడీఎల్పీ భేటీలో నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరంగా ఉండాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రేపు శాసనసభలో జగన్ సర్కార్ మండలి రద్దుపై తీర్మానం ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ‘మండలి అవసరమా?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం శాసనసభలో చేసిన వ్యాఖ్యలు రద్దుకు సంకేతాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు జరిగే కేబినెట్‌ భేటీలో మండలి రద్దుకు ఆమోదం తెలిపి ఆ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఆ తర్వాత సభలో ఆమోదం పొందిన అనంతరం పార్లమెంట్‌కు పంపి మండలి రద్దు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.